- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది’
దిశ, సెంట్రల్ డెస్క్: పన్ను చెల్లింపుదారుల కోసం సులువైన విధానాన్ని కేంద్ర పరోక్ష పన్నుల మండలి(సీబీఐసీ) తీసుకొచ్చింది. దీనికోసం ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని మొదలుపెట్టింది. గతంలో వ్యాపారం చేసినా, చేయకపోయినా జీఎస్టీ రిటర్నులను ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ శ్రమ లేకుండా వ్యాపార లావాదేవీలు లేనివారు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుందని వెల్లడించింది. వ్యాపారాలు లావాదేవీలు లేనివారందరూ జులై 1 నుంచి ఎస్ఎంఎస్ పంపాలని సీబీఐసీ స్పష్టం చేసింది. ఈ సదుపాయం వల్ల దేశంలోని 12 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లబ్ది చేకూరనున్నట్టు, అలాగే వ్యాపారం లేనివారు జీఎస్టీ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సిన అవసరంలేదని సీబీఐసీ వివరించింది. జీఎస్‌టీఆర్-1 రూపంలో నిల్ అనే స్టేట్‌మెంట్ ఎస్ఎంఎస్ చేయాలని తెలిపింది. ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. జీఎస్‌టీఆర్-1 ఫారమ్‌ను నెలవారీగా లేదంటే మూడు నెలలకు ఒకసారి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, జీఎస్‌టీఆర్-1ని పంపించాలనుకునే వారు ఇకమీదట 14409 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించి ఈ సౌకర్యాన్ని పొందాలని సీబీఐసీ పేర్కొంది. ఇప్పటికే నిల్ జీఎస్‌టీఆర్3బీని ఎస్ఎంఎస్ ద్వారా చేసే సదుపాయాన్ని ఈ నెల మొదట్లోనే అనుమతించింది.