సామాన్యుడికి భారీ షాక్‌ : వంట గ్యాస్‌ ధరల్ని పెంచిన కేంద్రం

by Anukaran |
సామాన్యుడికి భారీ షాక్‌ : వంట గ్యాస్‌ ధరల్ని పెంచిన కేంద్రం
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రానికి జాలీదయా ఉండదా..?ఎలాగూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కనీసం గ్యాస్‌ను కూడా వదలరా..? రోజుల వ్యవధిలో అటు పెట్రోల్ – డీజిల్తో పాటు గ్యాస్ సిలిండర్ ధరల పెరగడంతో వండేదెలా, తినేదెలా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్న మధ్య తరగతి కుటుంబాల్ని మరింత కుంగదీస్తుంది కేంద్రం. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న జనాలకు కూరగాయల ధరలు ఓ వైపు, గ్యాస్ధరల పెంపు డోలు, సన్నాయిలా వాయించేస్తున్నాయి. ఎంతో కొంత సబ్సిడీ వస్తుందని ఊపిరి పీల్చుకుంటున్న వినియోగదారులకు ధరల కుంపటిని వెలిగించింది కేంద్రం. రాయితీ సిలిండర్ పై రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వాణిజ్య సిలిండర్ పై రూ.184కు పెంచుతూ కేంద్రం ప్రకటించింది.

Advertisement

Next Story