ఎంఎస్ఎంఈల డిజిటలైజేషన్

by Shyam |
ఎంఎస్ఎంఈల డిజిటలైజేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను డిజిటల్ స్కిల్లింగ్, టెక్నాలజీతో సన్నద్ధం చేసి, సాధికారత కల్పించేందుకు సాప్ ఇండియా అనే సంస్థతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ మార్కెట్‌‌ను అందుకోవడానికి, శ్రామికశక్తికి డిజిటల్ స్కిల్లింగ్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీని కల్పించేందుకు ఈ ప్రక్రియ తోడ్పాటు అందించనుంది. పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్​‌రంజన్​ మాట్లాడుతూ స్థానిక ఎంఎస్ఎంఈల ప్రయోజనం, మార్కెట్, స్కిల్లింగ్, ఇతర సమస్య పరిష్కారాలను అందించేందుకు ఎస్ఏపీ గ్లోబల్​ టెక్నాలజీ ప్లేయర్ సహకరిస్తుందన్నారు. పరిశ్రమ, ప్రభుత్వ భాగస్వామ్యం బలపడేందుకు దోహదపడుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల మధ్య పారిశ్రామిక వృద్ధిపై నిరంతర దృష్టితో, ప్రభుత్వం స్థిరమైన ఆర్థికాభివృద్ధికి, సమగ్ర సామాజిక అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed