వాట్సాప్‌కు దీటుగా.. గూగుల్ చాట్ యాప్

by Sujitha Rachapalli |
వాట్సాప్‌కు దీటుగా.. గూగుల్ చాట్ యాప్
X

దిశ, ఫీచర్స్ : టెక్ దిగ్గజం గూగుల్ ఎంతో పాపులర్ అయిన ‘హ్యాంగవుట్స్’ చాట్ యాప్‌ను గత ఏడాది నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మరో యాప్ తీసుకొస్తున్నట్లు అప్పుడే ప్రకటించిన గూగుల్, తాజాగా ‘గూగుల్ చాట్’ పేరుతో విడుదల చేసింది. ప్రస్తుతం ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్. అయితే కొన్ని నెలలుగా ఈ యాప్ తమ కొత్త ప్రైవేట్ ప్రైవసీ విధానం తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ తమతమ అప్లికేషన్స్ పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ తమ చాట్ యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ యాప్‌ను Gmail‌లోనే ఇంటిగ్రేట్ చేసింది గూగుల్. ఈ గూగుల్ చాట్ యాప్ ప్రాథమికంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్ మాదిరిగానే డైరెక్ట్ మెసేజ్, టీం చాట్ రూమ్స్ అందించే యాప్. జీమెయిల్​‌లోనే మెయిల్​, మీట్​, రూమ్స్​ లాగానే చాట్​ ఆప్షన్ కూడా కనపడనుంది. ఇప్పటి వరకు కంపెనీ తన గూగుల్ వర్క్‌స్పేస్ వినియోగదారులను మాత్రమే చాట్ యాప్‌ను ఉపయోగించడానికి అనుమతించింది. కానీ తమ జీ మెయిల్ వినియోగదారులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం గూగుల్ చాట్‌ను ఐవోఎస్ వెర్షన్‌లో మాత్రమే తీసుకురాగా.. ఆండ్రాయిడ్ యూజర్లు కొద్ది కాలం వేచి ఉండాలి. ఆండ్రాయిడ్ వెర్షన్ త్వరలో వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ చాప్​ యాప్​ ద్వారా ఫేమస్ మెసేజింగ్ యాప్ వాట్సాప్​కు గట్టిపోటీ ఇవ్వాలని గూగుల్​ భావిస్తోంది

గూగుల్ చాట్ యాప్ కోసం :

ఐఫోన్ లేదా ఐప్యాడ్ వినియోగదారులైతే.. చాట్ యాప్‌ను పొందడానికి ముందుగా యాప్ స్టోర్ ద్వారా Gmail అప్లికేషన్‌ను అప్‌డేట్ చేయండి.
* స్క్రీన్‌కు టాప్ లెఫ్ట్‌లో ఉన్న శాండ్‌విచ్ మెనుపై క్లిక్ చేయాలి.
* సెట్టింగులపై క్లిక్ చేసి, మీ వ్యక్తిగత Google ఖాతాకు వెళ్లాలి.
* అక్కడ చాట్ ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత జీమెయిల్ యాప్​లో గూగుల్ చాట్ మెసేజింగ్​ ఎనేబుల్ అవుతుంది.

Advertisement

Next Story