- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ప్రభావం డేటాను విడుదల చేసిన గూగుల్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో సందర్శన కేంద్రాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్ మూతపడ్డాయి. ఆయా దేశాల్లో లాక్‌డౌన్ ప్రభావం ఎలా ఉందనే డేటాను కొవిడ్ 19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్స్ పేరుతో 131 దేశాల నివేదికను విడుదల చేసింది. పార్కులు, ఫార్మసీ స్టోర్లు, గ్రాసరీ షాపులు వంటి ప్రదేశాలకు యూజర్ల మూవ్‌మెంట్ ఆధారంగా ఆగ్రాగేటెడ్, అనానిమైజ్డ్ డేటా ద్వారా కమ్యూనిటీ ట్రాన్సిట్‌ని అంచనా వేశారు.
48 నుంచి 72 గంటల ముందు డేటాను అందిస్తామని, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ విషయం కారణంగా అందులో కనిపించే లెక్కలు పూర్తిగా కచ్చితమైనవి కావని గూగుల్ హెల్త్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ కరెన్ డిసాల్వో తెలిపారు. గూగుల్ మ్యాప్స్ ప్రదేశాలు ఎంత బిజీగా ఉన్నాయో చూపించడానికి కూడా ఇదే డేటా టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ సరికొత్త సమాచారం ద్వారా ఏయే ప్రదేశాల్లో ఎంత సమయం బిజినెస్ నడుస్తోందో అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కేవలం ప్రజల మూవ్‌మెంట్ ఎలా ఉందో తెలుసుకోవడమే కాకుండా, వారి గమ్యస్థానాల ఆధారంగా రక్షణ చర్యలు తీసుకోవచ్చు.
గూగుల్ విడుదల చేసిన డేటాలో భారతదేశానికి సంబంధించి కూడా వివరాలు ఉన్నాయి. వారి డేటా ప్రకారం, కేఫ్‌లు, షాపింగ్ సెంటర్లు, పార్కులు, మ్యూజియంల సందర్శన దాదాపు 77 శాతం తగ్గిందని, అలాగే ఫార్మసీ స్టోర్లు, గ్రాసరీ స్టోర్లకు 65 శాతం తగ్గుదల కనిపించింది. అయితే ఇళ్లలో ఉండే శాతం మాత్రం 22 శాతానికి పెరిగినట్లు పేర్కొంది.
Tags: Google, Covid Community, Grocery stores, Google health, Google maps