రిఫ్రిజిరేటర్లు, LED TV.. టీకా తీసుకున్నవారికి బంపర్ ఆఫర్లు

by Anukaran |   ( Updated:2021-11-12 21:03:56.0  )
Vaccination
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లో ఉన్నప్పటికీ, అనేక అనుమానాల కారణంగా ప్రజలు ఇప్పటికీ టీకాలు వేయించుకోలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజలు టీకాలు వేయించుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో టీకాలు తీసుకునే వారికి బహుమతులను కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్ “టీకా బంపర్ లక్కీ డ్రాను” ప్రకటించింది. LED TVలు, రిఫ్రిజిరేటర్ల నుండి వాషింగ్ మెషిన్ వరకు నిత్యం మనం ఉపయోగించే బహుమతులు లక్కీ డ్రాలో ఉన్నాయి.

మేయర్ రాఖీ సంజయ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజలకు బహుమతులను అందించాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కేంద్రాలలో నవంబర్ 12 మరియు 24 మధ్య వ్యాక్సిన్ తీసుకునే వారు ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హులని మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, LED టీవీ సెట్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందజేస్తామని చెప్పారు. అంతేకాకుండా 10 మందికి కన్సోలేషన్ బహుమతులుగా మిక్సర్-గ్రైండర్లు పొందుతారని తెలిపారు. చంద్రపూర్ నగరంలో అర్హులైన వ్యక్తుల సంఖ్యతో పోలిస్తే టీకాల సంఖ్య ఇంకా తక్కువగానే ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed