- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్ డెస్క్: రైల్వే ప్రయాణీకులకు తీపికబురు అందింది. అదనపు రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ సమాలోచనలు చేస్తోంది. అధికంగా రద్దీ ఉన్న మార్గాలలో ఈ రైళ్లను నడపాలని భావిస్తోంది. అయితే వీటిని గవర్నమెంట్ సొంతంగా నడపకుండా.. ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని యోచిస్తోంది. అంటే ప్రైవేట్ సంస్థలు ఈ 151 ట్రైన్లను రద్దీ మార్గాలలో నడుపుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. ప్రైవేట్ కంపెనీలు దరఖాస్తు పెట్టుకోవచ్చని పేర్కొంది. సెలెక్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 151 రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
ప్రైవేట్ కంపెనీలు నడిపే ట్రైన్లకు డ్రైవర్స్, గార్డ్స్ వంటి వారిని రైల్వే శాఖే నియమిస్తుంది. అలాగే రైళ్లకు సేఫ్టీ క్లియరెన్స్ ఇచ్చే అధికారం కూడా రైల్వే శాఖనే మోనేటర్ చేస్తోంది. కాగా సెలెక్షన్ ప్రక్రియ మాత్రం రెండు విడుదల్లో ఉంటుంది. తొలుత వచ్చిన బిడ్లను ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేస్తారు. తర్వాత తది సెలెక్షన్ జరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్యాసింజర్ ట్రైన్స్ నడిపేందుకు ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్వైట్ చేస్తోంది. దాదాపు రూ.30,000 కోట్లు పెట్టుబడులు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. రైళ్ల తయారీ, వాటి నిర్వహణ వంటి ఖర్చులు ప్రైవేట్ కంపెనీలే చూసుకోవాలి. వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఈ ప్రైవేట్ కంపెనీలు కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది.