మహిళలకు గుడ్ న్యూస్ : దిగొస్తున్న బంగారం 

by Harish |
మహిళలకు గుడ్ న్యూస్ : దిగొస్తున్న బంగారం 
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర (Gold Rates) తగ్గుతున్న క్రమంలో దేశీయ మార్కెట్లోనూ బంగారం దిగి వస్తోంది. ప్రస్తుత పరిణామాలతో బంగారం ధరలు ఒడిదుడుకులతోనే కొనసాగుతాయని కమొడిటీ మార్కెట్ల విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈక్విటీ మార్కెట్లు లాభపడుతుండటంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులను మరింత తగ్గిస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,957 డాలర్లకు తగ్గింది. ఆగష్టులో రికార్డు స్థాయిలో రూ. 59 వేలకుపైగా ఎగసిన పసిడి సుమారు రూ. 5 వేలకుపైగా తగ్గింది. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 570 తగ్గి రూ. 53,630కి చేరుకుంది.

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 560 తగ్గి రూ. 49,160కి చేరింది. వెండి ధరలు స్వల్పంగా కిలో రూ. 1500 తగ్గి రూ. 67,200గా ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే… 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ. 53,630గా ఉండగా, ముంబైలో రూ. 50,540, ఢిల్లీలో రూ. 54,600, కోల్‌కతాలో రూ. 52,830, బెంగళూరులో రూ. 52,720గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed