ఉగ్రరూపం దాల్చిన గోదారి.. నీట మునిగిన కొంగల వాగు..

by Sampath |   ( Updated:2021-07-23 02:27:11.0  )
ఉగ్రరూపం దాల్చిన  గోదారి.. నీట మునిగిన కొంగల వాగు..
X

దిశ, వాజేడు : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికితోడు తుపాకుల గూడెం సమ్మక్క సారక్క బ్యారేజి 59 గేట్లు ఎత్తివేసి 8 లక్షల 10340 క్యూసెక్కుల వాటర్ విడుదల చేయడంతో, ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ఉదయం 10 గంటల సమయానికి క్రమేపీ పెరుగుతూ11 మీటర్ల కు చేరుకుంది. సాయంత్రం సమయానికి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

దీంతో సిడబ్ల్యూసీ అధికారులు గోదావరి ఎగ పోటు కారణంగా వాజేడు కుమారుడి గ్రామాల మధ్య ఉన్న కొంగల వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ వంతెన నీట మునగడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి రవాణా స్థంభించింది. గోదావరి మరింతగా పెరిగి మొదటి ప్రమాద హెచ్చరికను దాటే అవకాశాలున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకుండా భద్రత చర్యలు చేపడుతున్నారు. చెక్కపల్లి బొగత జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులకు అనుమతి రద్దు చేశారు.

Advertisement

Next Story