- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఎంఎఫ్ 'డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్'గా ఆమెకు ప్రమోషన్!
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ప్రధాన ఆర్థికవేత్తగా ఉన్న గీతా గోపీనాథ్ అదే సంస్థల్లో కీలక బాధ్యతలను అందుకోనున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్లో భారతీయులు కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే దిగ్గజ సోషల్ మీడియా ట్విటర్ సీఈఓ గా పరాగ్ అగర్వాల్ ఈ జాబితాలో చేరారు. తాజాగా గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌లోనే అత్యంత కీలకమైన, సంస్థ రెండో స్థానంలో ఉండే హోదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు.
కోవిడ్-19 సంక్షోభానికి సంబంధించి విశేషమైన సేవలను గుర్తిస్తూ ఆమెకు ప్రమోషన్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా కోరల్లో కొనసాగుతున్న ఈ సమయంలో గీతా గోపీనాథ్ సేవలు ఐఎంఎఫ్‌కు అవసరమని సంస్థ అభిప్రాయపడింది. ‘గీతా గోపీనాథ్ కొత్త బాధ్యతలకు సానుకూలంగా ఉండటం సంతోషంగా ఉంది. ఆమె పనితీరుతోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించామని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఐఎంఎఫ్‌కు ఆమె ఎంతో సాయమందించారు. కొత్త బాధ్యతల్లో గీతా గోపీనాథ్ కీలక కార్యకలాపాలను నిర్వర్తించడమే కాకుండా నిఘా సంబంధిత విధానాల రూపకల్పన, పరిశోధన, ఇతర ప్రమాణాలను పర్యవేక్షిస్తారని ఐఎంఎఫ్ పేర్కొంది.