ప్రియురాలిపై ఆరు నెలలుగా అత్యాచారం.. ప్రియుడి నిజ స్వరూపం తెలిసి..!

by Sumithra |
Rape-Case11
X

దిశ, జల్‌పల్లి : ప్రేమిస్తున్నానని.. పెళ్ళి చేసుకుంటానని మాయమాటలతో ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ప్రియుడిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. బాలాపూర్ సీఐ భాస్కర్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మండలం ఎర్రకుంట సాదత్ నగర్‌కు చెందిన షేక్​అబ్దుల్లా బావజీర్ (22)అదే ప్రాంతానికి చెందిన 20 సంవత్సరాల యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు.

యువతి పెళ్ళి ఎపుడు చేసుకుంటావ్​అని గట్టిగా నిలదీయగా ప్లేట్ ఫిరాయించాడు. దీంతో యువతి బాలాపూర్​పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ షైక్ అబ్దుల్లా బావజీర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed