- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పటాన్‌చెరులో 17ఏళ్ల బాలిక మిస్సింగ్
by Sumithra |

X
దిశ, పటాన్ చెరు : బాలిక అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఇస్నాపూర్‌లో నివాసముంటున్న సంజయ్ కూతురు లక్ష్మీ (17) ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి స్నేహితులతో పాటు బంధువుల ఇళ్లలో విచారించాడు. అయినా, ఫలితం లేకపోవడంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story