- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాముకాటుకు బాలిక మృతి

X
దిశ, పాలకుర్తి : జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాము కాటుకు ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జిల్లాలోని పాలకుర్తి మండలంలో ఆదివారం వెలుగు చూసింది. బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని లక్ష్మి నారాయణ పురం గ్రామానికి చెందిన బండిపల్లి వర్షిణి (12) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున పాము కాటుకు గురైంది. బాలిక గట్టిగా ఎడుస్తూ కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వైద్యం కోసం ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలోనే పరిస్థితి విషమించి మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి మరణంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Next Story