- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ap: బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ.. ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీసీ సంక్షేమ సంఘం(AP BC Welfare Association) ఆధ్వర్యంలో విజయవాడ(Vijayawada)లో ర్యాలీ(Rally) నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు. బీసీ కుల గణన(BC Caste Census) చేయాలంటూ డిమాండ్ చేస్తూ విజయవాడ మున్సిపల్ స్టేడియం(Vijayawada Municipal Stadium) నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం(Tummalapalle Art Centre) వరకూ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. అయితే అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పరం తోపులాట జరిగింది. దీంతో పలువురు బీసీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో విజయవాడ నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ కుల గణన చేయాలని అడిగితే తమ నేతలను అరెస్ట్ చేశారంటూ బీసీ సంక్షేమం సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.