- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Abhishek: పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ అక్కర్లేదు.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishake benarjee) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్, సింబాలిక్ బెదిరింపులకు ఇది సమయం కాదని, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. ‘గత కొన్ని రోజులుగా ప్రధాన స్రవంతి మీడియా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారి ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నా. ఉగ్రవాద దాడికి దారితీసిన లోపాలను లోతుగా పరిశోధించే బదులు, వారు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చే కథనాన్ని ముందుకు తీసుకురావడంపై ఎక్కువ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
ఉగ్రవాద దాడులపై సమగ్ర దర్యాప్తు జరపడానికి బదులుగా, తప్పుడు సమాచారాన్ని ముందుకు తెస్తున్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. భద్రతా దళాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించిన విషయం తెలిసిందే.