- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కడపలో ఇంజక్షన్ వికటించి బాలిక మృతి

X
దిశ, రాయలసీమ : కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే బాలిక మృతి చెందిందని కుటుంబీకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబీకులు, బంధువుల ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు పోలీసులు చేరుకుని విచారణ జరిపారు.
గడచిన మూడు రోజులుగా జ్వరం రావడంతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు. శుక్రవారం రాత్రి ఇంజక్షన్ చేసిన చోట వాపు రావడంతో మరోమారు ఆస్పత్రికి బాధితులు వెళ్లారు. ఆస్పత్రిలో సరిగ్గా వైద్యం అందించకుండా వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ బాలిక బంధువులు ఆరోపణ చేశారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story