- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్‌కు అనూహ్యంగా ఎంఐఎం మద్ధతు తెలిపింది.
గ్రేటర్ నూతన మేయర్ విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కే.కేశవరావు కూతురు. ఆమె 1964లో జన్మించారు. గద్వాల విజయలక్ష్మి జర్నలిజం బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. 2015లో స్వదేశానికి తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె.. అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాబీరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
2015 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గద్వాల విజయలక్ష్మి.. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి ఆమె విజయం సాధించారు.