- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోస్టర్ ఎఫెక్ట్.. ఆర్జీవీకి రూ.4 వేల ఫైన్
దిశ, వెబ్ డెస్క్: వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ అధికారులు ఝలక్ ఇచ్చారు. తన సినిమా ప్రచారానికి ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించుకున్నారని జరిమానా విధించారు. దీంతో రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాన్ పై ఇటీవల రాంగోపాల్ వర్మ సినిమా తీసిన విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పవన్ ఫ్యాన్స్ రెచ్చగొట్టి ఫ్రీ పబ్లిసిటీ చేసుకున్నారు. అలాగే లాక్‌డౌన్ సమయంలో మొదటి సినిమా రిలీజ్ అంటూ ‘పవర్ స్టార్’ పోస్టర్‌ను హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీకి చెందిన గోడలకు అంటించారు.
పోస్టర్ అంటించినట్లు స్వయంగా రాంగోపాల్ వర్మ తన ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన సినిమా ప్రమోషన్స్‌కు ప్రభుత్వ ఆస్తులను రాంగోపాల్ వర్మ వాడుకున్నాడని.. అతని పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఈవీడీం విభాగం తమ అనుమతి లేకుండా పోస్టర్ వేసినందుకు ఆర్జీవీకి రూ.4వేల ఫైన్ వేశారు.