అర్హులైన కుటుంబాలకు వరద సాయం : లోకేష్ కుమార్

by Shyam |   ( Updated:2020-11-01 07:47:20.0  )
అర్హులైన కుటుంబాలకు వరద సాయం : లోకేష్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో వచ్చిన భారీ వరదల వలన నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల పరిహారం అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. ఆదివారం వరద బాధిత కుటుంబాలకు నగదు పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 3.87లక్షల మంది బాధితులకు రూ.387.90 కోట్ల సాయం అందజేశామన్నారు. అంతేకాకుండా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం కోసం ప్రభుత్వం రూ.550కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.

అర్హులైన కుటుంబాలకు తప్పకుండా నగదు సాయం చేస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని లోకేష్ కుమార్ వెల్లడించారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా హైదరాబాద్‌లో మరో 37 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed