‘రాబోయే 72 గంటలు జాగ్రత్త’

by Shyam |
‘రాబోయే 72 గంటలు జాగ్రత్త’
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 72 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ సమయంలోనే అతి భారీ వర్షాలు నగరంలో పడనున్నాయని చెప్పారు. కొన్ని చోట్ల ఏకంగా 9 నుంచి 16 సెంటీ మీటర్ల అతి భారీవర్షం పడే అవకాశం ఉందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం ఆయా సమీపంలోని కమ్యూనిటీ హాళ్లు, స్కూళ్లను రిలీఫ్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటల పాటు అధికారులు అందరూ అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ కుమార్ ఆదేశించారు. అలాగే, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.

Advertisement
Next Story