- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. వారి కోసం 10 రోజుల స్పెషల్ డ్రైవ్
దిశ, తెలంగాణ బ్యూరో : తమ పరిధిలోని సూపర్ స్ప్రెడర్స్‌కు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో ఉన్న 32 వ్యాక్సినేషన్ కేంద్రాలను గుర్తించి.. సర్కిల్ అధికారులకు జీహెచ్ఎంసీ ఆ వివరాలను సమర్పించారు. పది రోజుల స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తొమ్మిది విభాగాల్లోని మూడు లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వ్యాక్సిన్ సెంటర్లను గుర్తించిన తర్వాత కరోనా నిబంధనలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మెడికల్ విభాగం సిద్దమైంది.
కరోనా నివారణలో భాగంగా సూపర్ స్ప్రెడర్స్‌కు మాస్ వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి పది రోజుల పాటు తొమ్మిది కేటగిరీలుగా గుర్తించిన మూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే సర్కిల్ అధికారులకు ఆదేశాలు అందడంతో వారంతా కిరాణ దుకాణదారులు, మాంసం విక్రయ కేంద్రాల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. రేపటి నుంచి వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓ, అర్బన్కమ్యూనిటీ డెవలప్‌మెంట్(యూసీడీ) విభాగం అధికారులు బృందాలుగా వ్యాక్సినేషన్‌కు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు.
కేటగిరీలు, ఏరియాలుగా సూపర్ స్ప్రెడర్స్‌ను విభజించడం ద్వారా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాలని బల్దియా అధికారులు భావిస్తున్నారు. నిన్న, ఈ రోజు గుర్తించిన వారికి టోకెన్లు అందిస్తే రేపటి నుంచి వ్యాక్సిన్ అందిచనున్నారు. స్ట్రీట్ వెండర్స్, చికెన్, ఫిష్, కూరగాయల మర్కెట్స్, కిరాణ దుకాణదారులు, వైన్స్ షాప్స్,హెయిర్ కటింగ్ సెలూన్స్, లాండ్రీ షాప్స్, ఫ్రూట్, ఫ్లవర్ మర్కెట్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలో కూరగాయలను విక్రయించే వారికి ఆయా విభాగాల నుంచి టీకాలు అందించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఫంక్షన్ హాల్స్, మల్టీపర్పస్హాల్స్, స్కూల్స్, స్టేడియాలను వినియోగిస్తున్నారు.
వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రతీ నిత్యం 30 వేల మందిని లక్ష్యంగా నిర్ణయించుకున్న నేపథ్యంలో సెంటర్లలో కరోనా నిబంధనలు పాటించడం, సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిర్ణయించిన వారు మాత్రమే వ్యాక్సినేషన్ రోజు వచ్చేలా షెడ్యూల్ చేస్తున్నారు. తమ సర్కిళ్లలోని దుకాణదారులను ఇప్పటికే రోజుల వారీగా అధికారులు విభజించారు. వీరితో పాటు వైన్స్ దుకాణాల వారికి అబ్కారీ, డ్రైవర్లకు ట్రాన్స్‌పోర్ట్ శాఖ బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఏ రోజు.. ఏ సమయానికి ఏ సెంటర్‌కు వెళ్లాలో ముందు రోజే టోకెన్లను అందిస్తున్నారు. పది రోజులకు.. ఒక్కో రోజుకు వేర్వేరు కలర్స్‌లో టోకెన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. నిర్ణీత రోజుల్లో ముందుగా చెప్పిన సమయానికి వ్యాక్సినేషన్ కోసం వస్తుండటం వల్ల సెంటర్లలో రద్దీని తగ్గించడంతో పాటు విజయవంతంగా కార్యక్రమాన్ని ముగించవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సర్కిల్ వ్యాక్సిన్ సెంటర్
కాప్రా కుషాయిగూడ గవర్నమెంట్ స్కూల్
ఉప్పల్ రామాంతాపూర్ ఫంక్షన్ హాల్
హయత్ నగర్ కేబీఆర్ ఫంక్షన్ హాల్
ఎల్భీనగర్ హుడా కమ్యూనిటీ హాల్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ చంపాపేట్
సరూర్‌నగర్ గణేష్ ఫంక్షన్ హాల్ దిల్ సుక్ నగర్
మలక్‌పేట్ ముంతాజ్కాలేజ్ అక్భర్ బాగ్
సంతోష్ నగర్ మిత్ర స్పోర్ట్స్ క్లబ్ గౌలీపురా, ఎస్ఆర్టీ స్పోర్ట్స్ క్లబ్ రెయిన్‌బజార్
చంద్రాయణగుట్ట సుహణ ఫంక్షన్ హాల్ తాళ్ల కుంట
చార్మినార్ సన గార్డెన్, సర్దార్ మహాల్ దగ్గర
ఫలక్‌నుమా ఖుసుద్దా పోలీక్లీనిక్ జూపార్కుముందు
రాజేంద్రనగర్ ఎస్ఎన్సీ కన్వన్షెన్స్ శివరాంపల్లి
మెహిదీపట్నం ఎంపీ గార్డెన్
కార్వాన్ ఇంపిరియల్ గార్డెన్ టోలిచౌకి
గోషామహల్ రెడ్ రోస్ ఫంక్షన్ హాల్, పబ్లిక్ గార్డెన్ ముందు
ముషీరాబాద్ గవర్నమెంట్ స్కూల్ ముషీరాబాద్
అంబర్పేట్ ఇండోర్ స్టేడియం
ఖైరతాబాద్ సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్
జూబ్లీహిల్స్ బంజారా గార్డెన్ ఫంక్షన్ హాల్
యూసుఫ్ గూడ మహమూద్ పారడైస్ ఫంక్షన్ హాల్
శేరిలింగంపల్లి గచ్చిబౌలి స్టేడియం
చందానగర్ పీజేఆర్స్టేడియం
పఠాన్‌చెరువు మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ చైతన్యనగర్
మూసాపేట్ ఎన్‌కేఎన్‌ఆర్ పంక్షన్ హాల్ వై జంక్షన్ కూకట్పల్లి
కూకట్పల్లి నైనా గార్డెన్ మెట్రో పక్కన
కుత్భుల్లాపూర్ సరోజినిదేవి గార్డెన్ జీడిమెట్ల
గాజులరామారం మహారాజ గార్డెన్ చిత్తారమ్మ టెంపుల్ ముందు
అల్వాల్ వీబీఆర్ గార్డెన్ ఓల్డ్ అల్వాల్
మల్కాజిగిరి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్
సికింద్రాబాద్ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్, సీతాఫల్మండి
బేగంపేట్ మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్, బన్సీలాల్ పేట్.