రావత్ దంపతుల అస్తికలను పవిత్ర గంగానదిలో కలిపిన కూతుళ్లు

by Shamantha N |
bipinrawath
X

డెహ్రడూన్: దివంగత త్రివిధ దళపతి బిపిన్ రావత్ దంపతుల అస్తికలను కూతుళ్లు తరిణి, కృతిక శనివారం ఉదయం హరిద్వార్‌లోని పవిత్ర గంగా నదిలో కలిపారు. ఆయన కుమార్తెలు కుటుంబసభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అంతకుముందు శనివారం ఉదయం ఢిల్లీలోని బ్రార్ స్వ్కేర్ శ్మశానవాటిక నుంచి ఆస్థికలను తీసుకువచ్చారు. కాగా శుక్రవారం రావత్ కూతుళ్లు తరిణి, కృతిక‌లు తమ ఇంటి వద్ద సంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం వీరిద్దరి చేతుల మీదుగానే రావత్ దంపతులకు అంతిమ సంస్కారాలు చేశారు.

Advertisement

Next Story