ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఉచిత చికిత్స: మంత్రి గౌతమ్

by srinivas |
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఉచిత చికిత్స: మంత్రి గౌతమ్
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేసిన ఆయన, వారిపై స్టైరిన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని ‘సీఎస్ఐఆర్-ఎన్ఈఈఐఆర్’ నిపుణులుచెప్పారని అన్నారు.

దీంతో ఈ ప్రమాదం బారినపడి బాధితులందరికీ భవిష్యత్ లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిధిలోని ఐదు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని ప్రకటించారు. వారి ఆరోగ్యంపై ప్రభుత్వం పూర్తి భరోసా తీసుకుంటుందని అన్నారు. ఈ క్రమంలోనే వారంద్నీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని అన్నారు. భవిష్యత్‌లో వారికి వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివైనా, ఎంతటివైనా జీవితకాలం ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు.

ప్రజలక్షేమమే ప్రథమ కర్తవ్యమని భావించే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టైరిన్ తరలించేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణంలో ఉన్న 13వేల టన్నుల స్టైరిన్‌ను సీఎం ఆదేశానుసారం దక్షిణ కొరియాకు తరలిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే లోడింగ్ ప్రక్రయ ముగింపుదశకు వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంతో రాష్ట్రలో మరో ప్రమాదానికి తావులేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనుమానం ఉన్న అన్ని పరిశ్రమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed