- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఈటల గురించి మాట్లాడే అర్హత గంగులకి లేదు’
దిశ సిద్దిపేట: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి గంగుల కమలాకర్ విమర్శించడం హేయమైన చర్య అని టీఅర్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ అన్నారు. చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ‘గంగుల కమలాకర్ నిజమైన నికార్సైన గ్రానెట్ మాఫియా అని, ఆలాంటి నువ్వు ఈటలను విమర్శిస్తావా.. నువ్వెందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని’ జంగిటి ఎద్దేవా చేశారు. ఈటలను రాజీనామా చేయమని అడిగేముందు కేసీఆర్ దొడ్డిదారిన తెచ్చుకున్న వివిధ పార్టీల ఎమ్మెల్యే లను రాజీనామా చేయించాలన్నారు.
గురివింద గింజ తన కింది నలుపెరుగదన్నట్లు మీరు సక్రమమెట్లా ఇతరులు ఆక్రమమెట్లా అని అన్నారు. మరొకసారి ఈటల రాజేందర్‌ని విమర్శిస్తే తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్య్సకార సంక్షేమా సంఘం, ముదిరాజ్ జాతి ఉరుకొదని గంగులకు తగిన బుద్దిచెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్ల నాగార్జున, యూత్ ప్రధాన కార్యదర్శి సందిల కరుణాకర్, మండల అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షుడు మిద్దెల గణేష్, నాయకులు దొంతురబోయిన శ్రీనివాస్, రాగిరి చందు, కొత్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.