‘గంగా దసరా’.. రూల్స్ బ్రేక్ చేస్తూ వేల సంఖ్యలో భక్తుల స్నానాలు..

by Shamantha N |   ( Updated:2021-06-20 02:16:55.0  )
Ganga Dussehra
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వైపు దేశంలో సెకండ్ వేవ్ కారణంగా కరోనా వ్యాప్తి కొనసాగుతుంటే.. ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నేడు గంగా దసరా(గంగావతరణ) పర్వదినం.

ఈ నేపథ్యంలో గంగావరణ సందర్భంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ ప్రజలు ఆదేశాలను పట్టించుకోకుండా ఈరోజు హరిద్వార్, ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో భక్తులు నదిలో స్నానాలు చేసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. కరోనా నిబంధనలు పాటించకుండా నదిలో స్నానాలు చేశారు.

ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ పోలీసులు మాట్లాడుతూ.. గంగా దసరా సందర్భంగా భక్తులు ఎవరూ పవిత్ర స్నానాలకు రావద్దని కోరినట్టు తెలిపారు. ఈరోజు స్నానాల కోసం వచ్చిన వారిని సరిహద్దుల వద్ద RT-PCR నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. పవిత్ర స్నానాల సందర్భంగా కొవిడ్ నిబంధనల మార్గదర్శకాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలను హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed