యాదాద్రి జిల్లాలో మావోయిస్ట్‌ల కలకలం.. సీపీ మహేశ్ భగవత్ యాక్షన్ ఇదే..

by Sumithra |
CP MM Bhagavath
X

దిశ, భువనగిరి రూరల్: మాజీ మావోయిస్టులు కొత్త అవతారం ఎత్తారు. ఇంత కాలం ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వారు.. ప్రస్తుతం తమ కోసం దోపిడీలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో తుపాకులు ఎక్కు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బ్లాక్ మెయిల్‌కు తెర లేపిన ఐదుగురు ముఠా సభ్యుల ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ కథనం ప్రకారం..

revolver

‘‘సీపీఐ జనశక్తి, మావోయిస్టు పార్టీలో గతంలో పని చేసిన పిట్ల శ్రీనివాస్, నగ మల్లయ్య, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగపురం స్వామి, అశోక్ ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ తెలంగాణ రాష్టం పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులకు తుపాకులు చూపించి అక్రమంగా వసూళ్లకు పాల్పడేందుకు ఐదుగురు సభ్యుల ఈ ముఠా కుట్ర పన్నింది. వీరిలో ప్రధాన నిందితుడు పిట్ల శ్రీనివాస్ సొంతంగా వేపన్స్ తయారు చేయడంలో నేర్పరి. రివాల్వర్, తపంచా, పిస్టల్ తయారు చేసి మిగతా సభ్యులకు ఇవ్వడంతో అందరూ కలిసి ఈ దందాకు దిగారు.

Former Maoists

ఈ ఐదుగురు ముఠా సభ్యుల అక్రమాలపై భువనగిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిలో ప్రధాన నిందితుడు పిట్ల శ్రీనివాస్, నగ మల్లయ్య, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగపురం స్వామి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి ఒక తపంచా, పిస్టల్, రివాల్వర్‌తో పాటు చిన్న గ్యాస్ సిలెండర్స్, ఆరు పిస్టల్ లైవ్ రౌండ్స్, బుల్లెట్స్, మూడు మొబైల్స్, డ్రిల్లింగ్ మిషన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని, వీరిపై ఆమ్స్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు.’’

Advertisement

Next Story

Most Viewed