- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: గణేశ్ ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ!
దిశ, ఏపీబ్యూరో : ప్రైవేట్ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. ఒకేసారి ఐదుగురుకు మించకుండా పూజలు నిర్వహించాలని కోర్టు సూచించింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కుప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ -26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం భక్తులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించిన ధర్మాసనం ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినాయక చవితి వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను తప్పక పాటించాలని హైకోర్టు కీలక సూచనలు చేసింది.