- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిమజ్జనం తర్వాత బొమ్మలవుతున్న గణపతి ప్రతిమలు.. ఎలా అంటే ?
దిశ, ఫీచర్స్ : గతంలో గణపతి విగ్రహాలను మట్టితో తయారుచేసి, సహజ రంగులతో అందంగా అలంకరించేవారు. వీటితో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండేది కాదు. ప్రస్తుత విషయానికొస్తే ప్రతిమల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, థర్మకోల్ ఉపయోగిస్తూ.. సింథటిక్ రంగులతో మెరుగులు దిద్దుతున్నారు. ఈ విధంగా తయారైన విగ్రహాలను నవరాత్రి పూజలు ముగిశాక దగ్గరలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుండటంతో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. మతపరమైన ఆచారాలతో ముడిపడిన అంశం కాబట్టి కఠినంగా వ్యవహరించే పరిస్థితి లేదు. పైగా మట్టి గణపతులనే పూజిద్దామని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఈ క్రమంలోనే నాసిక్‌కు చెందిన 33 ఏళ్ల తృప్తి గైక్వాడ్.. ఈ సమస్యకు పరిష్కారం చూపడం విశేషం.
ఎకోకాన్షియస్ సబ్‌మెర్షన్..
ప్రొఫెషనల్‌గా అడ్వకేట్ అయిన తృప్తి.. తన సోషల్ ఆర్గనైజేషన్ ‘సంపూర్ణమ్ సేవా ఫౌండేషన్’ ద్వారా పలు సేవాకార్యక్రమాలు చేస్తోంది. ఈ మేరకు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన 20 వేలకు పైగా వస్తువులను రీసైకిల్ చేసి మురికివాడల్లోని పిల్లలకు వాటిని బొమ్మలుగా అందిస్తోంది. ఇంకా కొన్ని వస్తువులను వీధి జంతువులకు ఫుడ్ పెట్టేందుకు బౌల్స్‌గా, పక్షుల గృహాలుగా తయారుచేస్తోంది. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా మతపరమైన భావాలు దెబ్బతినకుండా ఉండేందుకు వీరి బృందం.. ప్రతి వస్తువును రీమేక్ చేయడానికి ముందు పూజ నిర్వహించడం విశేషం. ప్రతిమలను పొడి రూపంలో విచ్ఛిన్నం చేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP)ను ఉపయోగించి వివిధ రకాల బొమ్మలు తయారు చేస్తారు. పెద్ద సైజు చెక్క ఫ్రేమ్స్‌తో బర్డ్‌హౌస్‌లు రూపొందిస్తారు. వీటికి కొద్దిగా సిమెంట్‌తో కలిపి, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టేందుకు ఉపయోగించే బౌల్స్ తయారుచేస్తారు.
ప్రేరేపించిన సంఘటన..
నా ఇల్లు గోదావరి నదికి సమీపంలోనే ఉంది. ఒక రోజు ఓ వ్యక్తి కొన్ని పాత ఫొటో ఫ్రేమ్‌లను తీసుకొచ్చి నదిలో పడవేయడం చూశాను. అతన్ని ఆపి.. తాను పేపర్, ఉడ్ ఫ్రేమ్‌ను రీసైకిల్ చేస్తానని వివరించడంతో అతను అంగీకరించాడు. ఇది ‘సంపూర్ణమ్ ఫౌండేషన్’కు పునాది వేసింది. నాన్న ఆర్థికంగా హెల్ప్ చేయడంతో.. అప్పటి నుంచి ఎవరైనా పారవేయాలని చూస్తున్న ఏవేని శిల్పాలు లేదా ఫొటో ఫ్రేమ్‌లను తమకు పంపాలంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాను. మొదటి వారంలోనే సానుకూల స్పందన లభించింది. అలా ఇప్పుడు పుణె, నాగ్‌పూర్, ముంబై నుంచి కూడా ప్రజలు వస్తువులను పంపిస్తున్నారు. ఓపెన్ కమ్యూనికేషన్ కోసం సృష్టించబడిన వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరు మమ్మల్ని సంప్రదిస్తారు. కాగా రీసైక్లింగ్ కోసం ఇచ్చిన ప్రతీ వస్తువుపై కంపెనీ నామమాత్రపు రుసుము రూ .50 వసూలు చేస్తుంది. ఇది సరుకు రవాణా చార్జీలతో పాటు ఇతర విధానపరమైన ఖర్చులను కవర్ చేస్తుంది.