- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
షూటింగ్‌లో నటికి చేదు అనుభవం.. స్టార్ డైరెక్టర్‌పై ఆరోపణలు

దిశ, సినిమా: యూనివర్స్ మూవీ ‘వండర్ ఉమెన్’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ నటి గాల్ గాడెట్.. ఓ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పింది. డీసీ సూపర్ హీరో మూవీ ‘జస్టిస్ లీగ్’కి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ సినిమా ప్రారంభంలో దర్శకత్వం వహించాడు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా నుంచి తప్పుకోగా.. ఆయన ప్లేస్‌లో ఫిల్మ్ మేకర్ జాస్ వెడాన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన ఈ దర్శకుడు సినిమా షూటింగ్‌లో ఉండగా తన కెరియర్ గురించి బెదిరించాడని నటి గాల్ గాడెట్ తెలిపింది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని, అయితే మూవీ ప్రొడ్యూసర్స్ వార్నర్ బ్రదర్స్ మాత్రం సపోర్ట్ చేశారని తెలిపింది. గాల్ గాడెట్ డైరెక్టర్ వెడాన్‌పై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాకపోగా.. అతను చాలా మందితో ఇన్‌డీసెంట్‌గా బిహేవ్ చేశాడని, గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది హీరోయిన్.