రూ. 7,000 కోట్ల ఆదాయ నష్టం : కిశోర్ బియానీ

by Harish |
రూ. 7,000 కోట్ల ఆదాయ నష్టం : కిశోర్ బియానీ
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల దుకాణాలు పూర్తిగా మూసేయడంతో కరోనా వ్యాప్తి మొదలయ్యాక మూడు నాలుగు నెలల్లో ఫ్యూచర్ గ్రూప్ సంస్థ సుమారు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థపకుడు కిషోర్ బియానీ బుధవారం తెలిపారు. ఈ పరిణామాలే కంపెనీ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించేందుకు దారితీశాయని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగష్టులో రిలయన్స్ సంస్థకు ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ కొనుగోలు విలువ రూ. 24,713 కోట్లు. కొవిడ్-19 కారణంగా మొదటి 3-4 నెలల్లో మేము సుమారు రూ. 7 వేల కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోవడం వల్ల సమస్య నుంచి బయటపడేందుకు విక్రయించడం మినహా మరో మార్గం కనిపించలేదు. లేకపోతే సంస్థ వ్యాపారాలకు సంబంధించి చెల్లించాల్సిన అద్దె, రుణాలపై వడ్డీని చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యేవాళ్లమని కిశోర్ బియాని వెల్లడించారు. సంస్థ ముందున్న నష్టాల కారణంగా నిష్క్రమించడం తప్ప వేరే అవకాశంలేదని చెప్పారు.

Advertisement

Next Story