సత్యశ్రీతో జానీ మాస్టర్‌కు ఎఫైర్? 

by Shyam |   ( Updated:2020-12-07 07:37:33.0  )
సత్యశ్రీతో జానీ మాస్టర్‌కు ఎఫైర్? 
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ షోతో చమ్మక్ చంద్ర తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన స్కిట్ వస్తుందంటేనే అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. స్కిట్ ను పండించడంతో ఆయనతోపాటు టీం మెంబర్స్ కూడా సమన్వయంతో బాగా కష్టపడతారు. చంద్రకు జోడీగా ఉన్న సత్యశ్రీ పాత్ర కూడా ప్రతి ఎపిసోడ్‌లో కీలకంగా మారుతుంది. వాళ్ళ టీమ్ లో చంద్ర తర్వాత ప్రేక్షకులు అంతగా ఆదరించేది ఆమెనే. చమ్మక్ చంద్ర వల్లనే పాపులారిటీ తెచ్చుకున్న సత్యశ్రీ.. ఇటీవల హద్దులు మీరినట్టు చంద్ర గగ్గోలు పెడుతున్నాడు.

బొమ్మ అదిరింది షోలో నాగబాబుతో పాటు జడ్జిమెంట్ చేస్తున్న జానీ మాస్టర్‌తో సత్యశ్రీ ఎఫైర్ కొనసాగిస్తున్నట్టు చంద్ర గుర్తించాడు. దీనిపై సత్యశ్రీని నిలదీసినా ఆమె ఖండిచకుండా విషయాన్ని దాటవేసింది. జానీ మాస్టర్ సైతం నవ్వుతూనే నాకేం సంబంధం లేదని చెప్పాడే కానీ తమ మధ్య ఉన్న బంధాన్ని ఖండించలేక పోయాడు. ఈ ఇద్దరి వ్యవహారం అందరిలోనూ అనుమానం రేకిత్తించింది.

ఆదివారం రాత్రి ఓ టీవీ చానెల్ లో బొమ్మ అదిరింది షో ప్రసారం అయింది. ఆ షో స్కిట్‌లో భాగంగా చంద్ర తన కుమారుడిని ఇంగ్లిష్ పోయమ్ పాడమంటాడు. ఆ బాలుడు ‘జానీ జానీ ఎస్ పాప’ వరకే పాడి ఆపుతాడు. ఎన్నిసార్లు పాడినా ‘జానీ జానీ ఎస్ పాప’ వరకే పాడుతుండడంతో తన భార్య (సత్యశ్రీ) ని పిలిచి మన బాబు పద్యం పాడమంటే ‘జానీ జానీ ఎస్ పాప’వరకే పాడి ఆపుతున్నాడు.. నీకు, జానీ మాస్టర్ కు ఎఫైర్ ఉందా అని ఫైర్ అవుతాడు. లేదండి ‘వాడు నీ కొడుకే’ అని వెళ్లి పోతుంది. జానీ మాస్టర్ కూడా ఆ బాబుకు నాకు ఏం సంబంధం లేదు. నన్ను లాగకండి అంటూ నవ్వుతూ సమాధానం ఇస్తాడు. ఇది స్కిట్‌లో భాగంగా వచ్చే ఎఫైర్ మాత్రమే.. కానీ నిజ జీవితంలో కాదండోయ్..!

Advertisement

Next Story