స్టేట్ రోడ్లకు పెరిగిన కేటాయింపులు

by Shyam |
స్టేట్ రోడ్లకు పెరిగిన కేటాయింపులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రోడ్లు భవనాల శాఖకు కేటాయింపుల్లో ఈసారి ప్రభుత్వం కేటాయింపులు పెంచింది. మొత్తం రోడ్లు, భవనాల శాఖకు రూ. 3వేల321 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో పెట్టుబడి వ్యయంగా రూ. 1468 కోట్లిచ్చింది. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం రోడ్లు, భవనాల శాఖకు పెట్టుబడి వ్యయం కింద రూ.350 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.1468 కోట్లకు పెంచడం గమనార్హం. వీటిలో రాష్ట్ర రహదారుల(స్టేట్ రోడ్స్) విభాగానికి గత ఏడాది బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం రూ.187 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.669 కోట్లు కేటాయించారు. ఇక భవనాల విభాగంలో సెక్రటేరియట్ నిర్మాణానికి పెద్దగా నిధులేవీ కేటాయించలేదు. కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి రూ.275 కోట్లు కేటాయించారు.

ఆర్టీసీకి రూ. 1000 కోట్లు..

తెలంగాణ రోడ్‌ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్‌(ఆర్టీసీ)కి బస్సుల కొనుగోలుకు రూ.530 కోట్లు కేటాయించగా, మరో 400 కోట్లను కూడా రుణంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం బడ్జెట్ పేర్కొంది.

అటవీ, పర్యావరణ శాఖకు…రూ.780 కోట్లు

ఈ ఏడాది అటవీ, పర్యావరణ శాఖకు ప్రభుత్వం గతేడాదిలానే రూ.785 కోట్లు కేటాయించింది. వీటిలో కాంపెన్సేటరీ అఫారెస్టేషన్, సోషల్ ఫారెస్ట్రీ కింద మొక్కలు పెంచడానికి కూడా కొన్ని నిధులు కేటాయించారు.

tags: budget, roads building, rtc funds, forest dept

Advertisement

Next Story

Most Viewed