- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు విడుదల
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కృష్ణా బేసిన్‌లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఐదు పంపుల నిర్వహణకు మూడేండ్ల కాలానికి రూ. 13.54 కోట్లను విడుదల చేసింది. ఒక్కో మోటరు 30 మెగావాట్ల కెపాసిటీ ఉండగా 800 క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉంది.
అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల నిర్వహణ కోసం రూ. 15.90 కోట్లను విడుదల చేశారు. గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీ స్టేజ్ –1లోని వేంపల్లి పంప్‌హౌస్, నవాబ్ పంప్‌హౌస్, బొదేపల్లి పంప్‌హౌస్ నిర్వహణ కోసం రూ. రెండేండ్ల కాలానికి రూ. 4.27 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పంప్‌హౌస్, ఎత్తిపోతల పథకాల్లో పలు మరమ్మతులు, మోటార్ల నిర్వహణకు ఈ నిధులు వినియోగించాలని సూచించారు.
Advertisement
Next Story