- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అల్పపీడన ద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం
దిశ, వెబ్‌డెస్క్ :
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుండగా.. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగష్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే, తెలంగాణలో కూడా మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు.