మానుకోటలో ఫ్రీడమ్ రన్

by Shyam |
మానుకోటలో ఫ్రీడమ్ రన్
X

దిశ, వనపర్తి,మహబూబాబాద్ : స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలకు చేరువైన సందర్భంగా స్వతంత్ర భారత్ అమృత్ మహోత్సవాలను వనపర్తి, మహబూబాబాద్ పట్టణాల్లో నిర్వహించారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఎకో పార్క్ వరకు 2కె రన్ ను చేపట్టారు. 2K రన్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష,జిల్లా ఎస్పీ అపూర్వ రావు జెండా ఊపి ప్రారంభించారు. మహబూబాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ రన్ లో కలెక్టర్ విపి గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి,పోలీస్ సిబ్బంది పాల్గొని పరుగులు తీశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యం సాధనలో ఎందరో మహానుభావుల,స్వతంత్ర సమరయోధులు బలిదానాలు,త్యాగాల ఫలితంగానే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులను పీల్చుకో కలుగుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో త్యాగాలను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కలిసికట్టుగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు గోపాల్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది, హాకీ, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, యువతీ యువకులు,స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు,ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed