హైదరాబాద్ లో… ఫోన్ చేస్తే ఫ్రీ ఫుడ్

by Shyam |
హైదరాబాద్ లో… ఫోన్ చేస్తే ఫ్రీ ఫుడ్
X

దిశ వెబ్ డెస్క్ :
కరోనా నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. మన రాష్ట్రంలోనూ ఏప్రిల్ 15వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇల్లకే పరిమితం అయ్యారు. ఎంతో మంది పని కోల్పోయారు. హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ మూతపడ్డాయ్. పెళ్లిల్లు కూడా వాయిదా పడ్డాయ్. దీంతో అనాథలకు, రోడ్లపై జీవించేవారికి, భిక్షగాళ్లకు, దినసరి కూలీలకు ఆహారం దొరకడం లేదు. వారి కోసం ఇప్పటికే చాలా మంది ఆహారం అందిస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటిన్(రూ. 5 భోజన శాలలు) లు కూడా తెరుస్తున్నారు. అయితే ఇంకా ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. అందువల్లే ఎవరైనా ఆహారం కోసం ఎదురు చూస్తుంటే.. ఈ 7569193320 నెంబర్ కు కాల్ చేయండి.

లాక్డౌన్ కంప్లీట్ అయ్యేవరకు అనాథలకు రోజులో ఒక్కపూట అయినా కడుపు నిండా భోజనం పెట్టాలని భావించిన పద్మారావునగర్ కు చెందిన శ్రీవేదిక కన్వెన్షన్ హాల్ యజమాని ప్రేమ్ కుమార్ నిత్యం వెయ్యి మందికి ఫుడ్ అందిస్తున్నారు. 40 మంది వలంటీర్లతో బైక్లపై వెళ్లి రహదారుల వెంట ఉండే అనాథలకు పంపిణీ చేస్తున్నారు. వారం క్రితం స్టార్ట్ చేసిన అన్నదానం లాక్డౌన్ ఎత్తేసే వరకు కొనసాగిస్తామని ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎవరైనా తమ ప్రాంతంలో ఆహారం లేక ఇబ్బంది పడే వారిని గుర్తించి 7569193320 నంబర్ కు ఫోన్ చేస్తే ఫుడ్ పంపిస్తామని చెబుతున్నారు.

Tags: lock down , food, orphans, daily labours, charity, free food,

Advertisement

Next Story

Most Viewed