- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ప్రతినెలా ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ
దిశ, భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని నిరుపేద బ్రాహ్మణులకు ప్రతినెలా నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి రోజున సూపర్‌బజార్ సెంటర్‌లోని సాయిబాబా భజన మందిరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి ప్రతీ కుటుంబానికి కొంత నగదు కూడా అందచేశారు. అమెరికాలోని రామాయణ పారాయణ సేవాసమితి సహకారంతో ప్రతినెలా రెండవ శనివారం సాయిబాబా భజనమందిరంలో ఈ వితరణ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
సరుకుల పంపిణీ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు కోన ఆనంద్‌కుమార్ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ ఈ మహోన్నత కార్యక్రమానికి దాతలు, ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఎంతో భరోసా అని తెలిపారు. ఈ స్ఫూర్తితో పేదవర్గాలకు అండగా నిలిచేందుకు మరికొందరు ముందుకు వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ చక్రవర్తి, చినజియ్యర్ మఠం అధ్యక్షులు వెంకటాచారి, ఎస్‌బీఐ రిటైర్డ్ అధికారి శంకర్‌రావు, సాయిబాబా భజన మందిరం నుంచి ఆర్‌కె రామారావు, నరసింహారావు (అర్టీసీ) కొవ్వూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.