- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైన్ తాగిన ఏనుగులు !
దిశ వెబ్ డెస్క్: మీకు ఈ విషయం తెలిస్తే.. తెగ నవ్వేస్తారు. ఎందుకుంటే ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం అంత విచిత్రంగా ఉంది. అందుకే ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అలాంటి సందర్భం గురించి గతంలో మీరు ఎప్పుడూ విని ఉండరు. కనీసం ఆ విధంగా మీ ఆలోచనకు ఇంతవరకు తట్టి ఉండదు. అదేంటో చూద్దాం.
ఓ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోల్లో కనిపించే కొన్ని జంతువులు విచిత్రంగా ప్రవర్తించాయి. కారణమేమిటంటే.. అవి పంటపొలాల్లో మందు తాగాయి. ఇది వినడానికే విచిత్రంగా ఉంది. అవును మరీ.. ఇది నిజం.. ఆ పూర్తి వివరాల్లొకెళితే..
కరోనా వైరస్ … గడప దాటనివ్వట్లేదు. మనుషులంతా ఇంటికి పరిమితం కావడంతో జంతువులు వీరవిహారం చేస్తున్నాయి. మనమంతా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ఫ్యూ విధించుకుని, రోడ్డు మీద కనబడకుండా ఉంటుంటే.. ఏనుగులు మాత్రం గుంపుగా వచ్చి మద్యం సేవించి గోలగోల చేస్తున్నాయి. ఓ పక్క కరోనా వైరస్ భయంతో జనాలంతా హడలెత్తిపోతుంటే.. జంతువులు మాత్రం జనావాసాల్లోకి వచ్చి జల్సాలు చేసుకుంటున్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో 14 ఏనుగులు మందు తాగి పండుగ చేసుకున్నాయి. మొక్కజొన్న, చెరుకు తోటలు ఎక్కడుంటే.. అక్కడికి ఏనుగులు వెళ్లడం సహజం. ఎందుకంటే వాటికి చెరుకు, మొక్కజొన్నలంటే చాలా ఇష్టం. వాటిని కట్టడి చేయడం కోసం చాలా మంది తోటలకు కాపలా ఉంటారు. అయితే.. కరోనా ప్రభావం వల్ల తోటమాలులు, అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరూ కూడా తోట వైపు రాలేదు. దీంతో మొక్కజొన్న తోటల్లోకి వచ్చిన ఏనుగులకు అడ్డు చెప్పేవారు లేకుండా పోయారు. అక్కడ అవి తమ కడుపునిండా తిన్నాయి. అనంతరం అవి గుంపుగా అటువైపు వెళ్తున్న సమయంలో ఆ ఏనుగుల్లో రెండింటికి అటుపక్క ఉన్న ‘కార్న్ వైన్’ టిన్నులు కనిపించాయి. ఇక అవి ఊరుకుంటాయా.. దాదాపుగా 30 బాటిళ్లలోని మందు తాగేశాయి. అంతగా మందు తాగడంతో మత్తులోకి జారుకున్నాయి. అనంతరం అవి టీ తోటల్లో ఆదమరిచి నిద్రపోయాయి. అవి వైన్ తాగి నిద్రపోయిన ఫొటోలను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వన్ ట్వీట్ చేయడంతో.. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Tags : ELEPHANTS, WINE, CORN, TEA GARDENS, CHINA, CORONA VIRUS,