బ్రేకింగ్.. డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

by  |   ( Updated:2021-04-03 04:19:49.0  )
బ్రేకింగ్.. డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు కన్నడ సినీ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్తల ప్రమేయం ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో నగరానికి చెందిన సందీప్‌రెడ్డి, కలహర్‌రెడ్డిల పాత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇప్పటికే నైజీరియన్‌ను పట్టుకున్న బెంగళూరు పోలీసులు వారిని విచారించగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కలహర్‌, సందీప్‌, శంకర్‌ గౌడకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. దీంతో ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

విచారణలో సందీప్‌, కలహర్‌రెడ్డి ఇద్దరు కలిసి బెంగళూరులో పబ్‌లు, హోటళ్లు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వీరు తరుచుగా తెలంగాణకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇస్తున్నారు. అలాగే కన్నడ సినీ పరిశ్రమకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ సినీ నిర్మాత శంకర్‌ గౌడతో కలిసి ఫైనాన్స్ నిర్వహిస్తున్నారు. కలహర్‌రెడ్డి ప్రజాప్రతినిధులకు పార్టీ ఇచ్చేవాడని సందీప్‌ తెలిపాడు.

వీరిలో తెలంగాణకు చెందిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు ఉన్నారని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని, నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ సంచలన విషయాలు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఓ ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపినట్టు సందీప్ పోలీసులకు చెప్పాడు. కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ తో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు త్వరలోనే ప్రశ్నించనున్నారు.

Advertisement

Next Story