భూమి పంచాయితీ.. ‘కులం’ పేరుతో దూషించినందుకు నలుగురిపై కేసు

by Sumithra |
jail
X

దిశ, జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూమి తగాదా ఘటన బుధవారం వెలుగుచూసింది. జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన బనవాత్ శ్రీనివాస్‌ను అదే గ్రామానికి చెందిన బుర్ర రాజాగౌడ్, రాజేశ్వరి, కొల్లిపాక సత్తన్న, టి.శ్రీనివాస్‌లు కులం పేరుతో ఇష్టం వచ్చినట్టు దూషించారు. దీంతో మనస్తాపం చెందిన బనవాత్ శ్రీను పోలీసులను ఆశ్రయించాడు. తనను కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో ఆ నలుగురిపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు స్థానిక ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు.

Advertisement

Next Story