తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా

by srinivas |   ( Updated:2020-11-28 09:15:19.0  )
తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తా
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్​మోహన్​రెడ్డిని పొగడడం తన పని కాదని, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్​ అన్నారు. రాజమండ్రిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కేవలం రూ.7 వేల కోట్లే ఇస్తామంటోందని గుర్తుచేశారు. కనీసం దశల వారీగానైనా రూ.47 వేల కోట్లు సాధించేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. కేవలం ప్రాజెక్టు అథారిటీ అడిగితే కేంద్రం నిధులు ఇస్తుందనుకోవడం అవివేకమన్నారు. ప్రత్యేకహోదా, పోలవరం అంశాల వల్లే జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని ప్రత్యేక హోదాలా మార్చొద్దని సూచించారు. కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని నిలదీయడం లేదని, జనం నమ్మే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు.

Advertisement

Next Story