బీజేపీ దేశానికి మంచిది కాదు : ఉండవల్లి

by srinivas |   ( Updated:2021-01-12 02:59:09.0  )
బీజేపీ దేశానికి మంచిది కాదు : ఉండవల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల పరిణామాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో గత 15 రోజులుగా కొత్త రకం రాజకీయం మొదలైందని.. దానికి మతం రంగు పులిమారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు జరిగితే రాజకీయ పార్టీలకు ఏంపని అని మండిపడ్డారు. రాజకీయల ప్రమేయం లేకుండా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని… అప్పుడు 24 గంటల్లో నిందితులను పట్టుకుంటారని తెలిపారు. అంతేగాకుండా బీజేపీ సిద్ధాంతం దేశానికి మంచిది కాదని, బీజేపీ సిద్ధాంతం మూలంగా దేశం ప్రమాదంలో పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రామతీర్థానికి చంద్రబాబు రామతీర్థం వెళితే.. అదేరోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారని, పోటీగా వెళ్లారా? మరి ఎందుకు వెళ్లారో అర్థం కావడంలేదన్నారు. జగన్ క్రిస్టియన్‌.. హిందువు అనడానికి ఏముందని.. రుషికేస్ వెళ్లడంలో విచిత్రం ఏముంది అన్నారు. రాజశేఖర్ రెడ్డి సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి ఎలాంటి వివాదం లేదు.. జగన్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరి మతాన్ని వారు ఆచరించాలని.. అల్లా, యేసు ప్రభువు, ముక్కోటి దేవతలపై ఎవరి నమ్మకం వారిదన్నారు. ప్రపంచంలోని మిలటరీ మొత్తాన్ని తీసుకొచ్చినా మన దేశంలో ఆలయాలకు సెక్యూరిటీని పెట్టలేమన్నారు.

Advertisement

Next Story