- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్‌ది తెలంగాణ కాదు.. షర్మిల తెలంగాణ బిడ్డే’
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆమెను మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ అని.. ఇదే గడ్డమీద జన్మించింది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బిడ్డకాదని, కే.కేశవరావు తండ్రి కూడా ఆంధ్రా నుంచి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పనిచేసేందకు వస్తున్న మహిళను అందరూ స్వాగతించాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కేరళకు చెందిన మహిళ అని గుర్తుచేశారు.
అయితే తెలంగాణలో పార్టీకి ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్న షర్మిలతో రంగారెడ్డి సమావేశం కావడం రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేగాకుండా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రంగారెడ్డి షర్మిలతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమెతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన కూడా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశాననడం, షర్మిల పార్టీపై విమర్శలు చేసిన వారిపై ఆగ్రహం చేయడంతో రంగారెడ్డి షర్మిలకు రాజకీయంగా అండగా ఉండబోతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రానున్న రోజుల్లో షర్మిలకు రంగారెడ్డి అండగా ఉంటాడో లేదో చూడాలి.