- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మా కంపెనీ గ్రూప్ సలహాదారుగా ఆదిత్య పూరి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ దిగ్గజ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి ప్రముఖ ఫార్మా సంస్థ స్ట్రైడ్స్ గ్రూప్‌లో సలహాదారుగా చేరారు. అంతేకాకుండా స్ట్రైడ్స్ గ్రూప్ అసోసియేట్ కంపెనీగా ఉన్న స్టెలిస్ బయోఫార్మా బెంగళూరు డైరెక్టర్‌గా కూడా నియమించబడ్డారు. ‘స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ లిమిటెడ్‌లో ఆదిత్య పూరి సలహాదారుగా, డైరెక్టర్‌గా చేరడం సంతోషంగా ఉందని, అసోసియేట్ కంపెనీ స్టెలిస్ బయోఫార్మా డైరెక్టర్‌గా కూడా ఉంటారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
తమ కంపెనీ ప్రాథమిక దశ నుంచి పటిష్టమవుతూ, వృద్ధి దశకు చేరుకునే సమయంలో ఆదిత్య పూరి చేరిక వల్ల గ్రూపునకు మరింత ప్రోత్సాహవంతంగా ఉంటుందని, ప్రస్తుత తమ బయోఫార్మాస్యూటికల్ సంస్థ అభివృద్ధి చెందుతున్న, చెందిన మార్కెట్లలో తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలను దేశీయంగా ప్రవేశపెట్టాలనే లక్ష్యంగా ఉందని కంపెనీ తెలిపింది. ప్రాథమిక మౌలిక సదుపాయాల పరంగా స్టెలిస్ ఇతర గ్రూప్ సంస్థల ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేసేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆదిత్య పూరి చెప్పారు. ‘ఆదిత్య పూరి రాకతో స్టెలిస్ కంపెనీ సామర్థ్యంపై విశ్వాసం మరింత పెరగనుంది. ఆదిత్య పూరి అనుభవం గ్రూప్ సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుంది. బోర్డు విస్తరించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్టు బోర్డ్ ఆఫ్ స్ట్రైడ్స్ ఛైర్మన్ అరుణ్ కుమార్ వెల్లడించారు.