- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్లాక్ ఫంగస్‌తో వ్యవసాయ కూలీ మృతి
దిశ, సిరిసిల్ల: కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. సిరిసిల్ల జిల్లాలో ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకింది. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూనే ఆ వ్యక్తి శనివారం కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే… తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య(40) అనే వ్యవసాయ కూలీకి 20 రోజుల క్రితం కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు.
అయితే కరోనా నుంచి కోలుకున్న ఆయనకు మూడు రోజుల క్రితం కంటికి ఇన్‌ఫెక్షన్ కావడంతో అస్వస్థతకు గురయ్యాడు.చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.. బ్లాక్‌ఫంగస్ సోకినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బాల దుర్గయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న అతను శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు.