క్రీడా రంగంలో విషాదం.. గుండెపోటుతో మాజీ క్రికెటర్ మృతి

by Shamantha N |   ( Updated:2021-07-13 01:18:17.0  )
cricketer
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. 1983 వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టు సభ్యుడు, మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ (66) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 7.40 సమయంలో ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించేలోపు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1983 వరల్డ్ కప్ లో టీమిండియా తరపున ఆడిన యశ్‌పాల్ శర్మ భారత్ తరపున 37 వన్డేలు, 42 టెస్టులు ఆడారు. 1979 నుంచి 83 మధ్య కాలంలో మిడిల్ ఆర్డర్‌లో ఇండియా టీమ్‌కు కీలక ప్లేయర్‌గా యశ్‌పాల్ బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో జరిగిన వరల్డ్ కప్‌లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా యశ్‌పాల్ నిలిచారు. ఆయన హఠాన్మరణంతో క్రీడా రంగం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story