రాజన్న రాజ్యమంటే దోచుకోవడం.. దాచుకోవడమేనా..?

by Ramesh Goud |
YS Sharmila, NVSS Prabhakar
X

దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్ షర్మిల ఖమ్మం సంకల్ప సభలో టీఆర్ఎస్, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఆమె కామెంట్లపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజన్న రాజ్యమంటే దోచుకోవడం.. దాచుకోవడమేగా అని ప్రశ్నించారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చడం, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కోర్టుల చుట్టు తిప్పడమేనా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కరోనా ఉధృతి సమయంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామంటే అనుమతి ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షర్మిల చదివిన స్క్రిఫ్ట్ మొత్తం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని విమర్శించారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుందని, అయినా పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story