- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాస్‌వర్డ్‌లు మర్చిపోతున్నారట!
దిశ, వెబ్‌డెస్క్: జీవితం మొత్తం యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ల మయం అయింది. ఏది చేయాలన్నా లాగిన్ కావాలి. లేకపోతే సెక్యూరిటీ సమస్యలు వస్తాయి. డేటా మొత్తం ఇంటర్నెట్ గంగలో కలిసిపోతుంది. వ్యక్తిగత డేటాను రక్షించుకోవడానికి ఈ పాస్‌వర్డ్ పెట్టుకోవడం తప్పనిసరి. అలాగని అన్ని యాప్‌లకు ఒకే రకం యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ పెట్టుకున్నా ప్రాబ్లమే. అలాగని ఒక్కో యాప్‌కు ఒక్కో పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లో లేదా వ్యక్తిగత కంప్యూటర్‌లో పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకునే ఆప్షన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మొదటికే మోసం వస్తోందని సోషల్ మీడియా నిపుణులు అంటున్నారు.
ఎలాగూ మన సొంత స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ కాబట్టి మాటిమాటికి లాగిన్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ సడన్‌గా వేరే కంప్యూటర్‌లో గానీ, ఫోన్లో కానీ లాగిన్ చేయడానికి క్రెడెన్షియల్స్ గుర్తు రావడం లేదు. దాదాపు 70 శాతం మంది తమ పాత క్రెడెన్షియల్స్ గుర్తులేక కొత్త దాంట్లో లాగిన్ చేయాల్సినప్పుడల్లా ఫర్‌గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ద్వారా మళ్లీ అకౌంట్‌ను రికవరీ చేసుకుంటున్నారు. ఇలా ఎక్కువసార్లు రికవరీ చేయడం వల్ల అకౌంట్ హ్యాక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పాస్‌వర్డ్‌లు పెట్టే ముందు మీ ఒరిజినల్ పాస్‌వర్డ్‌గా ఒకటి పెట్టుకుని, దానిలోనే అంకెలు మార్చడం, అక్షరాలు మార్చడం లేదా చిహ్నాలు మార్చడం ద్వారా కొత్త పాస్‌వర్డ్‌లు సృష్టించుకుంటే మంచిదని సోషల్ మీడియా నిపుణులు సలహా ఇస్తున్నారు.