శ్రీశైలం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం… బాధిత కుటుంబాల ఆందోళన

by Shyam |   ( Updated:2020-08-21 07:45:11.0  )
శ్రీశైలం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం… బాధిత కుటుంబాల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయతే ఈ ప్రమాదంలో జల విద్యుత్‌లో చిక్కుకున్న తొమ్మిది మంది మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది. తాజాగా అగ్నిప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

చనిపోయిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాకుండా ప్రమాదంలో మరణించిన ఏఈలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు.

ఈ క్రమంలో జల విద్యుత్ కేంద్రంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వెంటనే పెంచాలని ఆసుపత్రి మార్చురీ ఎదుట, మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed