హోటల్ ఫుడ్ కోసం అరణ్యాన్ని వీడుతున్న ఎలుగులు

by Shyam |
bears,
X

దిశ, ఫీచర్స్: యాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్న ప్రస్తుత తరం హోటల్ ఫుడ్‌కు విపరీతంగా అలవాటు పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ టైమ్‌లోనూ జోరుగా సాగిన ‘బిర్యానీ’ ఆర్డర్లే అందుకు నిదర్శనం. అయితే జిహ్వ చాపల్యం మనుషులకే కాదు, జంతువులకు కూడా ఉంటుందని.. ఈ మేరకు ఎలుగుబంట్లు హోటల్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎలుగుబంట్లు హోటళ్లలో వడ్డించే ఆహారానికి అలవాటు పడ్డట్లు ఉదయపూర్ పరిశోధకులు తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ఈ అధ్యయన విషయాలు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పత్రిక ఓరిక్స్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. మోహన్‌లాల్‌ సుఖాడియా యూనివర్సిటికీ చెందిన పరిశోధకులు ఉత్కర్ష్ ప్రజాపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ కోలి, నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్ శాస్త్రజ్ఞుడు కేఎస్ గోపీ సుందర్ ఈ రీసెర్చ్‌ను లీడ్ చేశారు.

మౌంట్ అబు అడవుల్లోని ఎలుగుబంట్లు తరచుగా అరణ్యాన్ని వదిలి నగరానికి వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో మనుషులపై కూడా దాడులు చేశాయి. గత ఐదేళ్లుగానే ఎలుగుబంట్లు నగరాలకు రావడం ఎక్కువైందని అక్కడివారు చెబుతుండటంతో ఈ విషయాన్ని అటవీ అధికారులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఉదయపూర్ పరిశోధకులు ఎలుగుబంట్లపై అధ్యయనం చేపట్టగా.. డంప్ యార్డ్ వద్ద హోటల్వాళ్లు పడేస్తున్న ఆహార పదార్థాలకు అవి అలవాటు పడ్డట్లు తెలిసింది. అందువల్లే అవి రాత్రిళ్లు నగరాల్లోకి వచ్చి ఆహారం కోసం వెతుకుతున్నాయని, ఆహారం దొరకని పరిస్థితుల్లో మనుషులపై దాడులు కూడా చేస్తున్నాయని స్పష్టమైంది.

Advertisement

Next Story

Most Viewed